సినీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ సంజయ్ గుప్తా కన్నుమూత

తలకు గాయం కావడంతో 59 ఏళ్ల వ‌య‌సులో మృతి

ముంబై : హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. ‘కాంటే’, ‘కాబిల్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా 59 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శ‌నివారం ఆయన మరణవార్త వెలువడటంతో హిందీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. శుక్ర‌వారం రాత్రి తన నివాసంలోని బాత్‌రూమ్‌లో జారిపడటంతో సంజయ్ గుప్తా తలకు తీవ్ర గాయమైంది. దీనివల్లే ఆయన మరణించినట్లు సమాచారం.

చిత్రనిర్మాత అశోక్ పండిట్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన మరణాన్ని ధృవీకరించారు. ఈ వార్త పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, సంజయ్ గుప్తా తన ఇంట్లో తలకు గాయపడ్డారని పేర్కొన్నారు.సంజయ్ గుప్తాను ఒక అద్భుతమైన కథకుడు , సినిమా పట్ల ఎంతో మక్కువ కలిగిన వ్యక్తిగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు , అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

సంజయ్ గుప్తా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా , నిర్మాతగా హిందీ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘కాబిల్’ వంటి చిత్రాల ద్వారా ఆయన క్రైమ్ డ్రామాలు , యాక్షన్ కథలను తెరకెక్కించడంలో తనదైన శైలిని చాటుకున్నారు .ఆయన మరణంతో హిందీ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా పనిచేసిన ఒక ప్రతిభావంతుడైన చిత్ర నిర్మాతను, అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను క‌లిగిన ద‌ర్శ‌కుడిని, ర‌చయిత‌ను కోల్పోయినట్లయింది.

Leave A Reply

Your Email Id will not be published!