ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీకి ర‌వి బస్రూర్ సంగీతం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్

బెంగ‌ళూరు : డ్రాగన్ మూవీ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించనున్నారు వెల్ల‌డించారు. ‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎవరు సంగీతం అందిస్తారనే దానిపై అభిమానుల్లో పెద్ద చర్చ జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తారని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ధృవీకరించారు .ఈ విషయాన్ని దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోవడంతో ఈ విజయవంతమైన ద్వయం మళ్లీ కలుస్తుండటం పట్ల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

గతంలో ప్రశాంత్ నీల్ రూపొందించిన పలు విజయవంతమైన చిత్రాలకు రవి బస్రూర్ సంగీతం అందించారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌లోని రెండు భాగాలకు ఆయన సంగీతం సమకూర్చడమే కాకుండా ‘సలార్’ చిత్రానికి కూడా పనిచేశారు. వీరి గత చిత్రాలు శక్తివంతమైన నేపథ్య సంగీతం , ఉత్సాహభరితమైన పాటలతో బాగా ప్రాచుర్యం పొందాయి. యాక్షన్ సన్నివేశాలను గుర్తుండి పోయేలా చేయడంలో , ప్రధాన పాత్రల స్థాయిని పెంచడంలో రవి బస్రూర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ‘డ్రాగన్’ చిత్రం కోసం ఈ ద్వయం మరోసారి జతకడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం రవి బస్రూర్ ఎలాంటి నేపథ్య సంగీతాన్ని అందిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను, మాస్ అంశాలను ప్లాన్ చేస్తున్నారనే దానిపై కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో కూడా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. కథానాయికగా రుక్మిణి వసంత్ ఎంపికయ్యారు. వీరితో పాటు అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా, సిద్ధాంత్ గుప్తా , ప్రభాస్ శ్రీను వంటి పలువురు ప్రముఖ నటులు ఈ చిత్రంలో భాగం కానున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!