హైదరాబాద్ : ఏఐ దెబ్బ అబ్బా అనేలా చేస్తోంది. ప్రపంచంలోని అన్ని రంగాలలో కలకలం రేపుతోంది. ఇప్పటికే టాప్ లో కొనసాగుతున్న ఐటీ రంగాన్ని షేక్ చేస్తోంది. తాజాగా ఏఐ సినిమా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేలా ఉందని అంటున్నారు సినీ రంగానికి చెందిన నిపుణులు. తాజాగా ఏఐ ప్రభావం ఏ మేరకు ఉండబోతోందనే దానిపై కీలక కామెంట్ చేశారు ప్రముఖ తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు, చిత్ర నిర్మాత సుందర్. ఆయన సినిమా భవిష్యత్తు గురించి ఒక ఆసక్తికరమైన అంచనా వేశారు. సాంప్రదాయ షూటింగ్ లేకుండా సినిమాలు తీసే రోజు రావచ్చు అని ఆయన అన్నారు. తన రాబోయే సినిమా ప్రమోషన్ సందర్భంగా జరిగిన ఒక సంభాషణలో చిత్ర నిర్మాణంలో టెక్నాలజీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏఐలో పురోగతి చివరికి సాంప్రదాయ చిత్ర నిర్మాణ ప్రక్రియను మార్చగలదని సుందర్ సి నమ్ముతున్నారు. భవిష్యత్తులోప్రతి సన్నివేశాన్ని లొకేషన్‌లో చిత్రీకరించాల్సిన అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పూర్తి సినిమా సీక్వెన్స్‌లను సృష్టించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు సుందర్. లొకేషన్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు, పాత్రలు , విజువల్ సీక్వెన్స్‌లను డిజిటల్‌గా రూపొందించడం టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెప్పారు. ఇటువంటి పరిణామాలు సినిమాలను ప్లాన్ చేసే, నిర్మించే , ప్రేక్షకులకు అందించే విధానాన్ని గణనీయంగా మార్చగలవు అని పేర్కొన్నారు.
సుందర్ సి తన రాబోయే ప్రాజెక్ట్ మహాశక్తి లోని సాంకేతిక పని గురించి కూడా చర్చించారు. ఈ చిత్రంలో 3,000 కంటే ఎక్కువ సీజేఐ షాట్లు ఉన్నాయని, ఇది దాని విజువల్ ఎఫెక్ట్స్ పనుల స్థాయిని తెలియ జేస్తుందని నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సుదీర్ఘ కాలం పాటు సుమారు 800 మంది సాంకేతిక నిపుణులు పాల్గొన్నారని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.