కులాంత‌ర వివాహంపై స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నా

మొద‌టిసారిగా నోరు విప్పిన న‌టి కీర్తి సురేష్

చెన్నై : మ‌హాన‌టి సావిత్రి మూవీతో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో చెర‌గ‌ని ముద్ర వేసిన న‌టి కీర్తి సురేష్. ఆ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబుతో క‌లిసి న‌టించింది. తాజాగా త‌న వివాహం అయ్యాక కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తెలిపింది. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను బ‌హిరంగంగా వెల్ల‌డించింది. తాజాగా త‌ను చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ స‌మ‌స్య భిన్న మ‌తాల‌కు చెందిన వారం కావ‌డం వ‌ల్ల త‌లెత్తింద‌ని పేర్కొంది. నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ను 15 ఏళ్ల ప్రేమాయణం తర్వాత 2024 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఇటీవల ‘కర్లీ టేల్స్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో తన కుటుంబంలో ఎదురైన సవాళ్ల గురించి ఆమె వివరించారు. అంతే కాకుండా తన కాలేజీ డైరీని చదవడం ద్వారా తన తల్లికి తమ ప్రేమ వ్యవహారం ఎలా తెలిసిందో కూడా గుర్తు చేసుకున్నారు కీర్తి సురేష్.

తాను 12వ తరగతి పూర్తి చేసిన వెంటనే ఆంటోనీతో డేటింగ్ ప్రారంభించానని కీర్తి వెల్లడించారు. తన కాలేజీ డైరీలో వారి ప్రేమకు సంబంధించిన వివరాలు ఉండటంతో, దానిని చదివిన తన తల్లికి ఈ విషయం తెలిసి పోయిందని ఆమె చెప్పారు. తాను తల్లిని కాబట్టి డైరీని చదివే హక్కు తనకు ఉందని సమర్థించుకుంద‌ని తెలిపారు. గతంలో డైరీ రాసే అలవాటు తనకు ఎంతో ఇష్టమని, కానీ ఈ సంఘటన తర్వాత తాను డైరీ రాయడం మానేశానని కీర్తి తెలిపారు. ఆ డైరీని కోల్పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేస్తూ, అది తిరిగి దొరికితే బాగుండునని అన్నారు. తన తల్లి బహుశా ఆ డైరీని కాల్చివేసి ఉండవచ్చని ఆమె సరదాగా అనుమానం వ్యక్తం చేశారు. కీర్తి తన వివాహం గురించి, ఆంటోనీతో తన బంధాన్ని అంగీకరించేలా కుటుంబాన్ని ఒప్పించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా మాట్లాడారు. త‌ను క్రైస్త‌వ మ‌తానికి చెందిన వాడు కావ‌డంతో ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, ఆత‌ర్వాత స‌మిసి పోయింద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!