పంజాబ్ లో ఆప్ మాఫియా పాలన : రాహుల్ గాంధీ
సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
పంజాబ్ : లోక్ సభ ప్రతిపక్ష నేత, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పంజాబ్ లో కొలువు తీరిన ఆప్ సర్కార్ ను ఏకి పారేశారు. పాలన గాడి తప్పిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను మత్తు పదార్థాలు, మాఫియా పాలన డామినేట్ చేస్తోందని ఫైర్ అయ్యారు. మత్తు పదార్థాలు, మాఫియా ముఠాల కారణంగా పంజాబ్ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వాపోయారు. ఈ మత్తు పదార్థాల మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయని , మరోవైపు పలువురు దారుణ హత్యలకు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. వీరిలో సుఖ్వీందర్ సింగ్, గుర్మెల్ సింగ్‌లు హత్యకు గురయ్యారని, తన కొడుకును చిట్టా వ్యసనం నుండి కాపాడటానికి ప్రకాష్ చంద్ తన వద్ద ఉన్నదంతా అమ్ముకున్నాడని అన్నారు. ఈ మత్తుపదార్థాల మహమ్మారి కారణంగా తెహల్ సింగ్ తన ఇద్దరు కొడుకులను కోల్పోయాడని చెప్పారు.
అందుకే ఈ బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించడం జరిగిందన్నారు రాహుల్ గాంధీ. పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్‌కు ఒకే ఒక వాగ్దానం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం నుండి మత్తుపదార్థాల మహమ్మారిని, మాఫియా పాలనను పూర్తిగా నిర్మూలించి, పంజాబ్‌ను శ్రేయస్సు, అభివృద్ధి వైపు నడిపిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అగ్ర నేత. పంజాబ్ నేడు ఒక వినాశకరమైన మాదకద్రవ్యాల సంక్షోభం , మాఫియా పాలన కోరల్లో చిక్కుకుందన్నారు. గత ఎన్నికల సందర్బంగా లెక్కనేనన్ని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాటిని నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మొత్తంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచడంలో సీఎం భగవంత్ మాన్ ఫెయిల్ అయ్యాడని అన్నారు.
