క‌ర్ణాట‌క రాష్ట్రానికి ఖ‌ర్గే కుటుంబం ఏం చేసింది..?

నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కుమార స్వామి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కుమార స్వామి నిప్పులు చెరిగారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే, క‌ర్ణాట‌క రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కుటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీరి ఫ్యామిలీ ప‌ద‌వులు అనుభ‌వించ‌డం, దోచుకోవ‌డం త‌ప్పా క‌ర్ణాట‌క రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. ఉంటే చెప్పాల‌ని కుమార స్వామి స‌వాల్ విసిరారు. త‌న‌పై ప్రియాంక్ ఖ‌ర్గే చేసిన అభ్యంత‌ర కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ధీటుగా స‌మాధానం ఇచ్చారు. గుర్మితకల్ నియోజకవర్గ ప్రజల కోసం ఖర్గే కుటుంబం చేసిన కృషి ఏమిటని ఆయన ప్రశ్నించారు. నేను ‘గ్రామీణ మూర్ఖుడిని’ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అని కుమారస్వామి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక మంత్రి ప్రియంక్ ఖర్గేపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గుర్మితకల్ నియోజకవర్గ ప్రజలు ఖర్గే కుటుంబ సభ్యులను ఎనిమిది సార్లు అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నిక చేసి పంపారని, అటువంటి నియోజకవర్గంలోని రైతులు, గ్రామీణ కుటుంబాల కోసం ఆయన కుటుంబం ఏమి చేసిందో చెప్పాలని కుమారస్వామి అన్నారు.

ప్రియంక్ ఖర్గే , ఆయన తండ్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు గుర్మితకల్ నియోజకవర్గంలోని గ్రామాలను సందర్శించడానికి, అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎంత సమయం కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రియంక్ ఖర్గే గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఎంతమంది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పాలని కుమార స్వామి అన్నారు. ఆ గ్రామస్తులు, రైతులు , గ్రామీణ కుటుంబాలు దాదాపు 40 ఏళ్లుగా మీ కుటుంబానికి బాధ్యతను అప్పగించాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి మీరు ఎంతవరకు కృషి చేశారంటూ నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంపై ప్రస్తావించారు. త‌న‌ శాఖలోనే సంబంధిత పత్రాలు ఉన్నప్పటికీ ప్రియంక్ ఖర్గే తనను ఆధారాలు అడుగుతున్నారని కుమారస్వామి విమర్శించారు.

Leave A Reply

Your Email Id will not be published!