ఓటు హ‌క్కు మ‌నంద‌రి బాధ్య‌త : డీకే శివ‌కుమార్

ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం ఉంద‌న్న ముఖ్య‌మంత్రి

బెంగ‌ళూరు : భార‌త దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌జాస్వామ్యం అప‌హాస్యం అవుతోంద‌ని, అంత‌కు మించి ప్ర‌మాదంలో ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం డీకే శివ‌కుమార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ఓటు హక్కును పరిరక్షించడం మనందరి సామూహిక బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఇండియా’ కూటమి పార్టీల పిలుపు మేరకు జరిగిన “ఓటును కాపాడండి – దేశాన్ని కాపాడండి” నిరసన కార్యక్రమంలో మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌తో క‌లిసి పాల్గొన్నారు సీఎం డీకే శివ‌కుమార్. భార‌త రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు గాను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంట‌నే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, నిస్సిగ్గుగా ఆయ‌న 13 కోట్ల ఓట్ల‌ను చోరీ చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ కూట‌మి పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకు వ‌చ్చింద‌ని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధికారులు అని గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు డీకే శివ‌కుమార్. ప్రతి ఓటు ప్రజల శక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడటం, రాజ్యాంగ ఆశయాలను నిలబెట్టడం మనందరి బాధ్య‌త అని అన్నారు సీఎం. ఈ హక్కుల పరిరక్షణ కోసం త‌మ‌ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్ర‌క‌టించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్, ఏఐసీసీ పరిశీలకులు పల్లె రాజు, ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియప్పన్, రైతు సంఘం నాయకులు వీరసంగయ్య, ప్రకాష్ కె., సీపీఐ కి చెందిన సతీ సుందరేష్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్]కు చెందిన క్లిఫ్టన్ రోసారియో, నటుడు , సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్, సీపీఐ(ఎం) నిర్వాహకులు కె. నీల, ఇతర అనేక సంస్థల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!