విజయ్, జగన్, కేటీఆర్ నెట్టింట్లో వైర‌ల్

ట్రెండింగ్ లో కొన‌సాగుతున్న యువ‌నేత‌లు

చెన్నై : త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని ది లీలా ప్యాలెస్ అతిర‌థ మ‌హార‌థుల‌కు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఈ అత్యాధునిక సౌక‌ర్యాలు క‌లిగిన ఇంద్ర భ‌వ‌నంలో ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌జిన్ కూతురు శ్రేయ‌, ఉజ్వ‌ల్ పెళ్లి వేడుకకు సంబంధించిన రిసెప్ష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ, రాజ‌కీయ‌, క్రీడా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన దిగ్గ‌జాలు హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవురుల‌ను ఆశీర్వ‌దించారు. ఇదిలా ఉండ‌గా ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న‌తో పాటు తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయ‌న స‌తీమ‌ణితో పాటు ప్ర‌ముఖ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త , బిలియనీర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడైన అదానీ గ్రూప్ కంపెనీల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ కూడా హాజ‌ర‌య్యారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్ర‌ధానంగా యువ నేత‌లైన జ‌గ‌న్, కేటీఆర్, విజ‌య్ లు ఒకే వేదిక‌పై క‌లుసు కోవ‌డం, ముచ్చ‌టించు కోవ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వీరిని భావి సీఎంలుగా అభిమానులు పేర్కొంటున్నారు. వివాహ రిసెప్షన్‌లో విజయ్, జగన్, కేటీఆర్ ఆత్మీయ క్షణాలను పంచుకున్నారు . విజయ్ తన తల్లి, సహనటి త్రిషా కృష్ణన్‌తో కలిసి రాగా జగన్ తన భార్య, తల్లితో హాజరయ్యారు; కేటీ రామారావు తన భార్యతో విచ్చేశారు. వారి ఆలింగనాలు, కబుర్లు, గ్రూప్ ఫోటోలను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. వారిని ‘సౌత్ ఇండియన్ పవర్‌హౌస్‌లు’ అని ప్రశంసించగా, కొందరు తేలికపాటి రాజకీయ జోకులు కూడా వేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న నూతన వధూవరులకు వారు తమ శుభాకాంక్షలను తెలియ జేశారు.

Leave A Reply

Your Email Id will not be published!