‘రామాయ‌ణం’ విజువ‌ల్ వండ‌ర్ : అట్లీ కుమార్

అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చిన డైరెక్ట‌ర్

చెన్నై : కోలీవుడ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ర‌ణ బీర్ క‌పూర్, సాయి ప‌ల్ల‌వి శ్రీ‌రాముడు, సీత‌గా, య‌శ్ రావ‌ణ‌డిగా న‌టించిన చిత్రం రామాయ‌ణం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ప్ర‌స్తుతం చిత్ర నిర్మాత‌లు ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీస్తున్నారు. తొలి పార్టు వ‌చ్చేసింది. మ‌రింత ఆస‌క్తిని పెంచేలా చేసింది. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు సైతం ఈ మూవీపై స్పందిస్తున్నారు. తాజాగా ద‌ర్శ‌కుడు అట్లీ కూడా త‌న స్పంద‌న‌ను తెలిపాడు. విజువ‌ల్ వండ‌ర్ అంటూ కితాబు ఇచ్చాడు. నమిత్ మల్హోత్రా ‘రామాయణం’ చిత్రం అద్బుతంగా ఉంద‌న్నాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా ఉన్నత స్థానంలో నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. ఈ చిత్రంలోని తారాగణం, సంగీతం, విజువల్స్ , స్క్రీన్‌ప్లేను కొనియాడారు. ఈ చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశాన‌ని తెలిపాడు.

ఈ చిత్రంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ దర్శకుడు ‘రామాయణం’ కేవలం ఒక సినిమా కాదని, అదొక అనుభవమని అన్నారు. ఎంతటి దార్శనికత. ఎంతటి చిత్రణ. ఎంతటి అసాధారణమైన సినిమా అనుభవం అని పేర్కొన్నాడు. ‘రామాయణం’ ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ఉన్నత స్థానంలో నిలవడాన్ని సూచిస్తుందని తెలిపాడు. దాని దార్శనికతలో ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ మన సంస్కృతి, భావోద్వేగాలలో అందంగా పాతుకు పోయింది అన్నాడు అట్లీ. ‘రామాయణం’ తరతరాలుగా గుర్తుండి పోయే ఒక శాశ్వతమైన సినిమా అనుభవంగా నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.

ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ తమిళ చిత్ర దర్శకుడు, నటీనటుల అద్భుతమైన నటనను ప్రశంసించారు. రణబీర్ బ్రో, యష్ బ్రో, సాయి పల్లవి, రాకుల్, కాజల్, శోభన మేడమ్, చిత్ర బృందం మొత్తం నటన నాకు చాలా నచ్చిందన్నాడు. ఏ.ఆర్. రెహమాన్ , హన్స్ జిమ్మర్ అందించిన సంగీత మాధుర్యానికి ప్రత్యేక ప్రేమ, అద్భుతమైన విజువల్స్ అందించిన డీఎన్‌ఈజీ , సాంకేతిక బృందానికి అభినందనలు తెలియ చేస్తున్నాన‌న్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!