ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు నుంచి రజత్ పాటిదార్ వైదొలిగాడు. అతని స్థానంలో ఆయుష్ బదోని నియమితులయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది బీససీఐ. ప్రస్తుతం ఉన్న గాయాల నుండి కోలుకుంటున్నందున 50 ఓవర్ల ఫార్మాట్‌కు తనను ఎంపిక చేయవద్దని బీసీసీఐకి తెలియ జేసిన తర్వాత,= ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు నుంచి రజత్ పాటిదార్ వైదొలిగారు.
దీని ప్రకారం, ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు నుంచి అతనిని తొలగించారు. పురుషుల సెలక్షన్ కమిటీ రింకు సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించగా, పాటిదార్ స్థానంలో ఆయుష్ బడోనిని జట్టులోకి తీసుకున్నారు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం అప్‌డేట్ చేయబడిన ఇండియా A జట్టు ఇలా ఉంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్ , తిలక్ వర్మ కెప్టెన్ , రింకు సింగ్ వైస్ కెప్టెన్ , కుమార్ కుషాగ్రా , సూర్యాంశ్ షెడ్జ్, షాబాజ్ అహ్మద్, విప్రజ్ కోట్‌నిగమ్, తహర్ష్ దూబే, తహర్ష్ దూబే అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని ఆడనున్నారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ కు కీలక బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. తనను ఏకంగా కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.