వ‌సూళ్ల‌లో నితీష్ తివారీ రామాయ‌ణం రికార్డ్

రెండో రోజు బాక్సాఫీస్ వ‌సూళ్లు రూ. 221 కోట్లు

హైద‌రాబాద్ : నితీశ్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రామాయణం దుమ్ము రేపుతోంది. విడుద‌లైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్లు కూడా ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ వసూళ్లు: రూ. 221 కోట్లు రాబట్టింద‌ని టాక్. అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ‘రామాయణం- రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. భారతదేశంతో పాటు విదేశాల్లోని ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 221 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఈ విజయంతో ‘పఠాన్’, ‘ఆర్ఆర్ఆర్’ , ‘పుష్ప 2’, ‘జైలర్ 2’ ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రాల సరసన ‘రామాయణం’ కూడా చేరింది. ఈ సినిమాలు విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన చిత్రాలుగా నిలిచాయి ఈ చిత్రం ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపావళి పండుగ సీజన్‌లో బలమైన ప్రారంభం , సానుకూల సమీక్షలు ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించడంలో సహాయపడ్డాయి. ఈ చిత్రం భారతదేశంలో రూ. 48.05 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అలాగే విదేశీ మార్కెట్ల నుండి సుమారు రూ. 35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్త మొత్తం వసూళ్లు రూ. 221.05 కోట్లకు చేరుకున్నాయి.

భారతదేశంలో ఈ సినిమా రూ. 134.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, నెట్ వసూళ్లు రూ. 112.90 కోట్లుగా నమోదయ్యాయి. ఈ చిత్ర మొత్తం వసూళ్లలో హిందీ వెర్షన్ అత్యధిక వాటాను కలిగి ఉంది. ఒక్కరోజే 19,859 ప్రదర్శనల ద్వారా హిందీ వెర్షన్ రూ. 35.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

Leave A Reply

Your Email Id will not be published!