ఇరాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్
చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించిన ప్రెసిడెంట్
వాషింగ్టన్ : అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఇరాన్ పై నోరు పారేసుకున్నారు. చర్చలు పురోగమిస్తున్నంత కాలం ఇరాన్‌పై పునః సైనిక దాడులు ‘అత్యంత అసంభవం’ అని పేర్కొన్నారు. కానీ తదుపరి సైనిక చర్యలను తోసిపుచ్చలేదు. అమెరికా ఇప్పటికే ఇరాన్ ను తీవ్రమైన దెబ్బ కొట్టిందని, తదుపరి సైనిక చర్య అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం , హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి ప్రస్తావిస్తూ వారు చాలా బలమైన ఒప్పందంపై సంతకం చేస్తారా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది అని స్పష్టం చేశారు.
ఇరాన్‌లో విద్యుత్ కేంద్రాలు , వంతెనలతో సహా మౌలిక సదుపాయాల లక్ష్యాలను అమెరికా గుర్తించిందని చెప్పారు. గంటలో 38 వంతెనలను నాశనం చేయగలదని కూడా అధ్యక్షుడు వెల్లడించారు.
చాలా మటుకు దాని అవసరం ఉండదు అని ట్రంప్ పునరుద్ఘాటించారు. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని తీవ్రంగా కోరుకుంటున్నారని తెలిపారు. క్రిప్టోకరెన్సీ నెట్‌వర్క్‌ల ద్వారా టెహ్రాన్‌కు డబ్బు తరలించడంలో సహాయ పడ్డాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది కెనడియన్ వ్యాపార సంస్థలపై తన ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో వాషింగ్టన్ ఇరాన్‌తో చర్చలు జరుపుతోందని అంతకు ముందు ట్రంప్ అన్నారు. మేము ఇరాన్‌తో మాట్లాడుతున్నాము. ఎప్పటినుంచో మాట్లాడుతూనే ఉన్నామని తెలిపారు. సైనిక పరిస్థితి అమెరికాకు అనుకూలంగా ఉందని అధ్యక్షుడు అభివర్ణించారు. హోర్ముజ్ జలసంధి తెరుచు కుంటోందని చెప్పారు. తాము ఇరాన్‌ను ఓడించామని, ఇరాన్‌తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అని ఆయన అన్నారు.
