చెన్నై : ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని సాధించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్ర పోషించిన ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ నవంబర్ 12న బుధవారం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఓటీటీ విడుదలలో తొలగించిన సన్నివేశాలు, పొడిగించిన నిడివి ఉంటాయని అభిమానులు ఆశించారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా నిడివిని 2 గంటల 43 నిమిషాలుగా పేర్కొంది. దీనిని బట్టి డిజిటల్ వెర్షన్‌లో అదనపు ఫుటేజ్ ఏదీ ఉండదని స్పష్టమవుతోంది. తొలగించబడిన సన్నివేశాలను చూడాలనుకుంటున్న వారు, చిత్ర నిర్మాతలు తొలగించిన సన్నివేశాల విడుదలను ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే.
థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ‘జైలర్ 2’ ఎలా రాణిస్తుందనే దానిపై అందరి దృష్టి ఉంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మోహన్‌లాల్, మీర్నా, శివ రాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి , ఎస్.జె. సూర్య కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. రజనీకాంత్ ఐకానిక్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా తిరిగి రావడంతో ఈ సీక్వెల్ థియేట్రికల్ విడుదలకు ముందే గణనీయమైన బజ్‌ను సృష్టించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ యాక్షన్, కామెడీ , మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కలయికను ఈ ఫ్రాంచైజీకి తీసుకు వచ్చారు. చిత్రంలోని తారాగణం ,ఆశ్చర్యకరమైన పాత్రలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించాయి.