ఆ ప్ర‌మాద ఘ‌ట‌నను ఇంకా మ‌రిచి పోలేక పోతున్నా

గుర్తు చేసుకున్న బాలీవుడ్ న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్

ముంబై : బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇల‌య నాయ‌గ‌న్ కీల‌క పాత్ర పోషించిన చిత్రం ఇండియన్ 2 . ఈ చిత్ర షూటింగ్ సెట్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం గురించి నటి కాజల్ అగర్వాల్ వెల్లడించారు. ఆ ఘటన జరిగి ఆరేళ్లు గడిచినా అది ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉంది. సినిమా షూటింగ్ సమయంలో భారీ క్రేన్ కూలి పోయినప్పుడు తాను మరణం అంచు నుంచి ఎలా తప్పించుకున్నానో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌న్నారు కాజ‌ల్ అగ‌ర్వాల్. ఆ రోజు ఏదో తెలియని శక్తి తన ప్రాణాలను కాపాడిందని నమ్ముతున్నారు.

ఈ విషాదకర ఘటన 2020 ఫిబ్రవరిలో చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అక్కడ దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ చిత్రానికి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగా సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలి పోయింద‌న్నారు న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్. ఈ ప్రమాదంలో చిత్ర బృందానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు. ఆ భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చాలా దగ్గరగా తాను కూర్చుని, మానిటర్‌లో షూటింగ్‌ను గమనిస్తున్నానని కాజల్ చెప్పారు. చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనతో పరిగెత్తడం చూసి, ఏం జరిగిందో తెలియక లేచి పక్కకు వెళ్లడానికి ప్రయత్నించాన‌ని న్నారు. . అయితే పొరపాటున ఒక టేబుల్‌కు తగలడంతో తాను కింద ప‌డి పోయాన‌ని అన్నారు.

వెనక్కి తిరిగి చూసేసరికి, ఆ భారీ క్రేన్ నేరుగా తన వైపే పడిపోవడం గమనించారు. తాను పడిపోయిన చోటికి చాలా దగ్గరగానే ఆ క్రేన్ కూలిపోయిందని కాజల్ తెలిపారు. ప్రమాదం జరిగిన ఆ క్షణంలో ఎవరో తనను వెనక్కి లాగినట్లు అనిపించిందని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు తనను ప్రమాదం నుంచి ఎవరు వెనక్కి లాగారో ఇప్పటికీ తెలియదని ఆమె చెప్పారు. అంతా సెకన్ల వ్యవధిలోనే జరిగిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాజల్ మాటల్లో చెప్పాలంటే, ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తనే మొదటి వ్యక్తి అయ్యే అవకాశం ఉండేది, కానీ ఏదో తెలియని శక్తి తనను కాపాడిందన‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!