అనిల్ రావిపూడితో జ‌త‌క‌ట్టిన జూనియ‌ర్ ఎన్టీఆర్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ద‌ర్శ‌కుడు, న‌టుడు

హైద‌రాబాద్ : టాలీవుడ్ టాప్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఆయ‌న ప్ర‌ముఖ విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనిల్ రావిపూడితో జ‌త‌క‌ట్టేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని అధికారికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్తను మించినది ఏదీ లేదు. ఇది ఎవరూ ఊహించని కలయిక. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున, డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ చిత్రాలు పూర్తి చేశాక ఆయన ప్రముఖ దర్శకులతో జతకడతారని ఆయన అభిమానులు, నెటిజన్లు చాలామంది ఊహించారు. కానీ అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించి సినీ అభిమానులను ఆశ్చర్య పోయేలా చేశారు.

యంగ్ టైగర్‌తో పాటు అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ పెద్ద వార్తను ధృవీకరించారు . ఇన్‌స్టా , ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి సృష్టించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర్.. మన కాంబినేషన్ ఎప్పటినుంచో రావాల్సి ఉంది… ఫుల్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం. కాదు కాదు, త్వరలోనే కడుపుబ్బా నవ్వొస్తుంది అని ఎక్స్ వేదిక‌గా అనిల్ రావిపూడి పేర్కొన్నారు. మ‌రో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. మా తదుపరి చిత్రాన్ని ప్రకటించడానికి గర్వ పడుతున్నామని పేర్కొన్నాడు. మునుపెన్నడూ లేని విధంగా నవ్వుల విందుకు సిద్ధంగా ఉండండి అని వెల్ల‌డించాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో క‌లిసి ‘జనవరి 12 విడుద‌ల‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 పొంగల్‌కు థియేటర్లలోకి రానున్నందు చిత్ర నిర్మాతలు షూటింగ్‌ను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!