ప్ర‌తి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : తెలంంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క కుటుంబానికి ఆరోగ్య ప‌రంగా భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కొత్త ప‌థ‌కాన్ని రూపొందించింది. ఈ మేర‌కు దానికి ఇందిర‌మ్మ క‌టుంబ జీవిత బీమా అని పేరు పెట్టింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప‌లు హామీల‌ను ఇచ్చింది. అందులో కీల‌క‌మైన‌ది ప్ర‌తి కుటుంబానికి ఆస‌రా ఇచ్చేందుకు, ఆరోగ్య భ‌ద్ర‌త క‌ల్పించేందుకు అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంత్రివ‌ర్గం కీల‌క భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఇందిరమ్మ జ‌యంతి సంద‌ర్బంగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది స‌ర్కార్. మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం కోసం దీనిని తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలిపింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి 18 నుండి 59 ఏళ్ల వయసు ఉండాల‌ని తెలిపింది. ఆ వ్య‌క్తి మరణించినప్పుడు ,ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం అని వెల్ల‌డించింది స‌ర్కార్. ఇందుకు గాను ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొంది.
ఈ ప‌థ‌కం కోసం ఆయా కుటుంబాల‌కు సంబంధించి కీల‌క సూచ‌న చేసింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డ్ ప్రతిని ఆధారంగా తీసుకుంటారు. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించడం ఈ ప‌థ‌క ముఖ్య ఉద్ధేశం. అర్హులైన వారు మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాల‌యంలో కానీ లేదా గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యంలో కానీ లేదా మున్సిపల్ కార్యాలయంలో కానీ సంప్ర‌దించాల‌ని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. ప్రభుత్వం ప్రకటించే అధికారిక మార్గదర్శకాలు, అర్హతలు ఉంటేనే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతార‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ పథకాన్ని ప్రారంభించనున్న‌ట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా శిబిరాలను నిర్వహించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!