ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిర్వాకం ఇంజ‌నీర్ల ఆగ్రహం

రిటైర్డ్ సీఈ ఎక్సటెన్షన్ ఆర్డర్ ని ర‌ద్దు చేయాలి

హైద‌రాబాద్ : రిటైర్డ్ సీఈ ఎక్సటెన్షన్ ఆర్డర్ ని ర‌ద్దు చేయాలని రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి మూకుమ్మ‌డిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ , తెలంగాణా ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ , అసోసియేషన్ అఫ్ తెలంగాణా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ,తెలంగాణ ఇరిగేషన్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన సీఈకి మ‌రోసారి నియ‌మించ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక పదవీ విరమణ పొందిన చీఫ్ ఇంజనీర్లకు ఇంజనీర్ ఇన్ చీఫ్ లకు తిరిగి పదవీ పొడిగింపులు ఇవ్వడం వల్ల జూనియర్ ఇంజనీర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు.

ప్రభుత్వము చీఫ్ ఇంజనీర్ క్యాడర్‌లో వరుసగా ఎస్.ఈ.లకు ప్రమోషన్లు కల్పించి, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాల్సిందిపోయి, ప్రభుత్వం రిటైర్ అయిన ఇంజనీర్లనే తిరిగి అదే క్యాడర్ పోస్టుల్లో నియమిస్తోందని మండిప‌డ్డారు. దీనివల్ల పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఐదు క్యాడర్లలో ఇంజనీర్ల ప్రమోషన్ అవకాశాలు దెబ్బ తింటున్నాయని పేర్కొన్నారు. ఎస్.ఈ.లుగా ఉన్నప్పుడు ఎక్స్‌టెన్షన్‌ల కారణంగా సరైన సమయంలో ప్రమోషన్లు పొందలేక పోయిన వారే సి.ఈ.లుగా ఇంజనీర్ ఇన్ చీఫ్ లుగా పదవీ విరమణ అనంతరం కూడా తిరిగి ఎక్స్‌టెన్షన్‌ల కోసం ప్రయత్నించడం ఆందోళన కలిగించే విషయం అని తెలిపారు. ప్రభుత్వం ఎక్స్‌టెన్షన్లను రద్దు చేస్తామని గతంలో పలు సార్లు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ ఎక్స్‌టెన్షన్లు ఇవ్వడం కొనసాగిస్తుండ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు జూనియ‌ర్ ఇంజ‌నీర్లు.

ఈ సమస్య అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో ఉన్నప్పటికీ, సాగునీటి శాఖలో ఇది తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. ఇప్పటికే సాగునీటి శాఖలో పలువురు ఇంజనీర్ ఇన్ చీఫ్ / చీఫ్ ఇంజనీర్ లకు (అదనంగా ఒక్కటో రెండో పోస్ట్లని కూడా అనగా రిటైర్ అయినా వారికీ మూడు సి ఈ పోస్ట్లు లేక ఒక్క సి ఈ, ఒక ఎస్ఈ పోస్టులకు సంబంధించ‌చి పొడిగింపులు ఇస్తుండ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు, ఇచ్చిన‌ ఎక్సటెన్షన్ గా ఇచ్చిన ఆర్డర్స్ ని వెంటనే రద్దు చేసి ఇప్పటికే ఇచ్చిన ఎక్స్‌టెన్షన్లను కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!