Deepika Padukone : టాలీవుడ్ స్టార్స్ తో న‌టించాల‌ని ఉంది

కోరిక బ‌య‌ట పెట్టిన దీపికా ప‌దుకోనే

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ మ‌ధ్య టాలీవుడ్ కు చెందిన మూవీస్ దుమ్ము రేపుతున్నాయి. ఒక‌ప్పుడు బాలీవుడ్ మూవీస్ హాట్ టాపిక్ గా మారాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. ఎస్ఎస్ రాజ‌మౌళి ఎప్పుడైతే డార్లింగ్ ప్ర‌భాస్ తో బాహుబ‌లి తీశాడో ఆనాటి నుంచి తెలుగు సినిమా వెలుగుతోంది.

ఆ త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా తో క‌లిసి తీసిన పుష్ప రాజ్ ఇండియాన్ షేక్ చేసింది. ఆ మూవీ కొట్టిన దెబ్బ‌కు బాలీవుడ్ విస్తు పోయింది.

ఈ త‌రుణంలో హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా ప్ర‌భాస్ తో న‌టిస్తోంది దీపికా ప‌దుకొనే(Deepika Padukone). ఆమె ఇటీవ‌ల గెహ్రియాన్ మూవీలో న‌టించింది.

ఇందులో త‌న‌కంటే చిన్న వాడైన హీరోతో హ‌ద్దులు మీరి న‌టించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 11న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది దీపికా ప‌దుకొనే.

తెలుగు హీరోల‌లో మీరు ఎవ‌రితో న‌టించాల‌ని అనుకుంటున్నార‌ని అడిగిన ప్ర‌శ్నకు ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పంది. ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీఆర్, పుష్ప‌రాజ్ తో పుష్ప అంటూ దుమ్ము రేపిన అల్లు అర్జున్ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది.

ఇక ప్ర‌భాస్ తో న‌టించ‌డం త‌న‌కు సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని తెలిపింది. వీరిద్ద‌రితో ఎప్పుడు న‌టించే ఛాన్స్ వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నాన‌ని దీపికా ప‌దుకొనే చెప్పింది.

Also Read : క‌ళావ‌తి పాట ప్రొమో అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!