Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ పేరు కంటే డీజే టిల్లుగా ఇప్పటికే మోస్ట్ పాపులర్ అయి పోయాడు. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా అంతగా పేరు రాలేదు. కానీ ఒకే ఒక్క సినిమా, సాంగ్ తో దుమ్ము రేపాడు.
సోషల్ మీడియానే కాదు ఎక్కడ చూసినా డీజే టిల్లు అదరగొడుతోంది. విముల్ కృష్ణ దర్శకత్వం వహించిన డీజే టిల్లు మూవీ ఈనెల 12న విడుదలైంది. భారీ రెస్పాన్స్ చూరగొంటోంది.
ఈ మూవీకి కథ దర్శకుడు రాస్తే మాటలు సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda )రాశాడు. సిద్దూ నటుడే కాదు రచయిత కూడా. మంచి టైమింగ్, టెక్నిక్, యాస, భాషతో అదరగొట్టే లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మనోడి హవా మొదలైంది. ఎక్కడికి వెళ్లినా మామూలుగా ఉండడం లేదు క్రేజ్. రామ్ మిరియాల పాడిన పాటకు సిద్దూ వేసిన స్టెప్పులు, డ్యాన్స్ అదర గొడుతోంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీకి నిర్మాతగా ఉన్న సూర్యదేవర నాగవంశీ డీజే టిల్లును నిర్మించాడు. మొదటి నుంచీ హీరో గురించి, చిత్రం గురించి పక్కా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
ఆయన ఆశించిన విధంగానే ఊహించని రీతిలో టాక్ వచ్చింది. విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది.
ఇప్పటి దాకా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదని, కానీ డీజే టిల్లుతో విన్నానని చెప్పాడు హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda ).
Also Read : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సూపర్