Ukraine Russia War : పెరిగిన వ‌ల‌స‌లు త‌ప్ప‌ని తిప్ప‌లు

ఉక్రెయిన్ పై ర‌ష్యా ఉక్కుపాదం

Ukraine Russia War : ఉక్రెయిన్ పై ముంద‌స్తు స‌మాచారం లేకుండానే దాడుల‌కు తెగ బ‌డ‌డంతో ఆ దేశం ఇప్పుడు హాహాకారాలు, ఆర్త‌నాదాల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది.

ఇప్ప‌టి దాకా 1000 మంది దాకా ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని అంచ‌నా. ఉక్రెయిన్(Ukraine Russia War) ను చేజిక్కించు కునేంత దాకా యుద్దం ఆపే ప్ర‌స‌క్తి లేద‌ని అంటోంది ర‌ష్యా. ప్ర‌ధాన న‌గరాల‌న్నీ ర‌ష్యా ఆర్మీ చేతుల్లోకి వెళ్లి పోయాయి.

కానీ రాజ‌ధాని మాత్రం ఇంకా ఉక్రెయిన్ ఆర్మీ చేతుల్లోనే ఉంది. ఓ వైపు చ‌ర్చ‌ల‌కు సిద్దంటూనే ఇంకో వైపు వార్ కొన‌సాగిస్తోంది. అమెరికా, యురోపియ‌న్ దేశాలు, బ్రిట‌న్, ఫ్రాన్స్ వార్నింగ్ ఇచ్చినా ప‌ట్టించు కోలేదు.

తాను చ‌ని పోయినా యుద్దం మాత్రం ఆప‌బోనంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు ఉక్రెయిన్ చీఫ్. ర‌ష్యా కంటిన్యూగా దాడులకు పాల్ప‌డుతుండ‌డంతో వేలాది మంది నిరాశ్ర‌యులుగా మారారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐక్య రాజ్య స‌మితి అంచ‌నా ప్ర‌కారం ఆదివారం రోజు 3 ల‌క్ష‌ల 68 వేల మందికి పైగా ప్ర‌జ‌లు వ‌ల‌స బాట ప‌ట్టారు. పేరెంట్స్ , చిన్నారులు, వృద్దులు న‌డుస్తూ పోతున్న దృశ్యాలు కంట‌త‌డి పెట్టిస్తున్నాయి.

వీరంతా పోలండ్, హంగ‌రీ, రొమేనియా, త‌దిత‌ర దేశాల‌కు త‌ర‌లి పోతున్నాయి. ఎంత దుఖఃం, ఎంత విషాదం..కనీసం మాన‌వ‌త్వం మ‌రిచి పోయిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్(Ukraine Russia War) ప‌ట్టంచు కోవ‌డం లేదు.

ఇదిలా ఉండ‌గా ల‌క్ష‌ల్లో వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. పోలండ్ స‌రిహ‌ద్దుల్లో 14 కిలోమీట‌ర్ల పొడ‌వైన కార్ల క్యూ కూడా ఉంద‌ని ఐక్య రాజ్య స‌మితి అధికార ప్ర‌తినిధి క్రిస్ మీజ‌ర్ వెల్ల‌డించారు.

Also Read : వీసాదారుల‌కు అమెరికా గుడ్ న్యూస్

1 Comment
  1. శ్రీనివాస్ says

    బాలికపై టీఆర్ఎస్ నేత అత్యాచారం!

    ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతోంది. నిర్మల్ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత షేక్ సాజిద్ ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడికొచ్చిన ఓ బాలికపై కన్నేశాడు. ఆ బాలికను లొంగదీసుకోవడం కోసం అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. దీంతో ప్లాన్ వేసిన అన్నపూర్ణమ్మ తాను నిజామాబాద్ వెళ్తున్నానని, తోడుగా రావాలని కోరి ఆ బాలికను వెంటబెట్టుకు వెళ్లింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మంచి దావత్ ఉందని, అది చాలా గ్రాండ్గా ఉంటుందని చెప్పి బాలికను హైదరాబాద్ కు తీసుకువచ్చింది.

    బాలికతో కలిసి హైదరాబాద్ చేరుకున్న అన్నపూర్ణమ్మ చార్మినార్ సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సాజిద్కు బాలికను అప్పగించింది. అక్కడతడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సాజిర్పై పోక్సో సహా పలు చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు. చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకెళ్లిన అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్లను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్టు గుర్తించారు. వారి ఫోన్ సిగ్నల్స్ చివరిసారి నిర్మల్, ఆ పరిసరాల్లోనే చూపించినట్టు తెలుస్తోంది. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!