Prabhas : ముద్దుపై డార్లింగ్ ప్ర‌భాస్ కామెంట్స్

కిస్ అంటే భయం కానీ అలా కానిచ్చేశా

Prabhas : పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌భాస్ తో పాటు పూజా హెగ్డే న‌టించింది.

డార్లింగ్ కు త‌ల్లిగా ఒక‌నాటి హీరోయిన్ భాగ్య‌శ్రీ న‌టిస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్త‌యింది. ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ డిక్లేర్ చేసింది.

ఇందులో భాగంగా చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు పాల్గొంటూ వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వ‌స్తున్నారు. త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర ఆన్స‌ర్స్ ఇస్తూ వ‌చ్చారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకుంటున్నారు. ద‌ర్శ‌కుడు అద్భుత‌మైన దృశ్య కావ్యంగా మ‌లిచాడు. ఇందులో స‌క్సెస్ అయ్యాడు. ఇప్ప‌టికే రాధే శ్యామ్ లో ప్ర‌భాస్(Prabhas) తో పాటు పూజా రొమాంటిక్ స‌న్నివేశాలలో జీవించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఉన్న‌ట్టుండి పూజా హెగ్డేతో లిప్ లాక్ కూడా ఉంద‌ని తెలిపారు డార్లింగ్ ప్ర‌భాస్. కాగా అంద‌రి ముందు చేయాలంటే తాను భ‌య‌ప‌డ్డాన‌ని చెప్పాడు.

సెట్ లో ఎవ‌రూ లేకుండా ఉంటే ప్రైవేట్ ప్లేస్ లో చేస్తాన‌ని చెప్ప‌డంతో డైరెక్ట‌ర్ ఓకే అన్నాడ‌ని తెలిపాడు ప్ర‌భాస్. ఇప్ప‌టి వ‌ర‌కు రాధే శ్యామ్ కు సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లు, టీజ‌ర్ దుమ్ము రేపుతున్నాయి.

ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిగా వ్యూస్ వ‌స్తున్నాయి. ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాధే శ్యామ్ మూవీ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

Also Read : గోపీ చంద్ 30వ సినిమాలో ఖుష్బూ

Leave A Reply

Your Email Id will not be published!