Zelenksy Putin : ఐదున్నర గంటల పాటు యుద్దానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన రష్యా చీఫ్ పుతిన్ ఉన్నట్టుండి మాట తప్పారు. ఆయన ఏ ఒక్క మాట మీద కూడా నిలబడటం లేదు.
దీనిపై యావత్ ప్రపంచం తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపింది. రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించినా దాడులు మాత్రం ఆపడం లేదు. విదేశాలకు చెందిన వారంతా ప్రస్తుతం ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు.
దీంతో ఆయా దేశాలు పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పుతిన్(Zelenksy Putin) యుద్ద నీతి తప్పాడు. వేలాది మంది అక్కడే ఉండి పోయారు.
మరియు పోల్ , వోల్నోవాఖ నగరాల్లో యుద్ద క్షేత్రం నుంచి పౌరులను తరలించేందుకు ఉక్రెయిన్ బస్సులు, రైళ్లను సిద్దం చేసుకున్న సమయంలో ఉన్నట్టుండి దాడులకు దిగింది.
ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు ప్రపంచానికి తెలియ చేశాడు. మారణ హోమాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో తనకు సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించిన నాటో ఉన్నట్టుండి ముఖం చాటేయడంపై జెలెన్ స్కీ మండిపడ్డాడు. రష్యా సైన్యం నిర్బంధించి మానవతా కారిడార్ కు నిరాకరించినట్లు ఆరోపించాడు.
నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని వాపోయాడు. రష్యా బలగాల చేతిలో 4 లక్షల మంది నగర వాసులు బందీగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నాడు జెలెన్ స్కీ
ఇదిలా ఉండగా ఓ వైపు రష్యా దాడులకు వ్యతిరేకంగా ఉక్రెయినియన్లు పోరాటానికి సిద్దమయ్యారు. దేశాధ్యక్షుడికి బాసటగా నిలుస్తామని ప్రకటించారు.
Also Read : దమ్ముంటే దా పుతిన్ తేల్చకుందాం