KCR CM : జిల్లాల వారీగా ఖాళీలు ఇవే

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ డిక్లేర్

KCR CM : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లుగానే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా (KCR CM)ఊపారు. ఈ మేర‌కు ఇవాల్టి నుంచే నోటిఫికేష‌న్లు జారీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇందులో భాగంగా 39 వేల 829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు.

వాటిని ప్ర‌త్య‌క్ష ప‌ద్ద‌తిన భ‌ర్తీ చేస్తామ‌ని (KCR CM)వెల్ల‌డించారు. వీటికి సంబంధించిన నియామ‌క ప్ర‌క్రియ వెంట‌నే ప్రారంభం అవుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌క‌టించిన జిల్లాల వారీగా చూస్తే హైద‌రాబాద్ లో అత్య‌ధికంగా పోస్టులు ఉండ‌గా అతి త‌క్కువ‌గా వ‌న‌ప‌ర్తి జిల్లాల్లో ఉన్నాయి.

ఇందులో కొత్త జిల్లాలు కూడా ఉండ‌డం విశేషం.

ఇక జిల్లాల ఖాళీలు ఇలా ఉన్నాయి. హైద‌రాబాద్ జిల్లాలో 5 వేల 268 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ లో

1,976, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరిలో 1,769 , రంగారెడ్డి జిల్లాలో 1,561 పోస్టులు, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 1,465 ఖాళీగా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్.

న‌ల్ల‌గొండ‌లో 1,398, కామారెడ్డిలో 1, 340 , ఖ‌మ్మం జిల్లాలో 1,340 , భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 1,316 పోస్టులు ఉన్నాయి. నాగ‌ర్ కర్నూల్ జిల్లాలో 1,257 , సంగారెడ్డిలో 1,243, మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాలో 1,213 , ఆదిలాబాద్ లో 1,193, సిద్దిపేట‌లో 1,178 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మ‌హ‌బూబాబాద్ లో 1,172, హ‌నుమకొండ‌లో 1,157, మెద‌క్ జిల్లాలో 1,149, జ‌గిత్యాల జిల్లాలో 1, 063,

మంచిర్యాల‌లో 1,023, యాదాద్రి లో 1,010, జ‌య‌శంక‌ర్ భూపాల ప‌ల్లిలో 918 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నిర్మ‌ల్ లో 876, వ‌రంగ‌ల్ లో 842, కుమ్రం భీం ఆసిఫాబాద్ లో 825,

పెద్ద‌ప‌ల్లిలో 800 పోస్టులు, జ‌న‌గాం జిల్లాలో 760, నారాయ‌ణపేట్ లో 741 జాబ్స్ ఉన్నాయి.

ఇక వికారాబాద్ జిల్లాలో 738 పోస్టులు, సూర్యాపేట‌లో 719, ములుగు జిల్లాలో 696,

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో 662, రాజ‌న్న సిరిసిల్ల‌లో 601, వ‌న‌ప‌ర్తి జిల్లాలో 556 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Also Read : వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం అంతా ఆంగ్లం

Leave A Reply

Your Email Id will not be published!