Kangana Ranaut : ‘క‌శ్మీర్ ఫైల్స్’ అస‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్

కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న కామెంట్స్

Kangana Ranaut  : బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టిగా పేరొందిన కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut )సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌లై దేశ వ్యాప్తంగా ప‌లు ప్ర‌శంస‌లు అందుకుంటున్న చిత్రం క‌శ్మీర్ ఫైల్స్.

ఈ చిత్రాన్ని జ‌మ్మూ క‌శ్మీర్ లో 1990లో జ‌రిగిన య‌ధార్థ ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించారు ఫిల్మ్ మేక‌ర్ వివేక్ అగ్ని హోత్రి. ప్ర‌త్యేకించి క‌శ్మీర్ పండిట్ల‌ను ఎలా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ఎలా ఊచ‌కోత కోశార‌నే దానిని హృద్యంగా తెర‌కెక్కించాడు.

ఈ సినిమా గురించి దేశ మంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో సినిమా యూనిట్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

కొంద‌రు వాస్త‌వాల‌ను జీర్ణించు కోలేని వాళ్లే ఈ చిత్రం గురించి దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో క‌శ్మీర్ ఫైల్స్ మూవీకి వినోద ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఇచ్చాయి.

తాజాగా ఈ సినిమా గురించి కంగ‌నా రనౌత్(Kangana Ranaut )ఇవాళ స్పందించింది. క‌శ్మీర్ ఫైల్స్ అస‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిందంటూ పేర్కొంది. మూవీ మాఫియాను ల‌క్ష్యంగా చేసుకుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

క‌రోనా త‌ర్వాత థియేట‌ర్ల‌లో మొద‌ట‌గా విజ‌య‌వంత‌మైన చిత్రంగా స్ప‌ష్టం చేసింది కంగ‌నా ర‌నౌత్. సినిమాను తీసిన వివేక్ అగ్నిహోత్రితో పాటు అద్భుతంగా న‌టించిన అనుపమ్ ఖేర్ ను ప్ర‌త్యేకంగా అభినందించింది.

అమ్ముడు పోయిన మీడియా సినిమా స‌క్సెస్ గురించి ప్ర‌స్తావించ‌ద‌ని ఫైర్ అయ్యింది. ఇదిలా ఉండ‌గా కంగ‌నా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : ఇంత‌కీ టిక్కెట్ రేట్ల పెంపు ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

Leave A Reply

Your Email Id will not be published!