Modi Mann : అభినందించడంలో, వెన్ను తట్టి ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి మోదీ తర్వాతే ఎవరైనా. తాజాగా పంజాబ్ లో అత్యధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ , ఇతర పార్టీలను మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 సీట్లు సాధించి పవర్ లోకి వచ్చింది.
ఆ పార్టీకి చెందిన తాజా మాజీ ఎంపీ, ప్రస్తుత ధురి నియోజకవర్గ ఎమ్మెల్యే, కమెడియన్, నటుడిగా పేరొందిన రాజకీయ నాయుడు భగవంత్ మాన్(Modi Mann )కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆ
ప్ ఏరికోరి మాన్ ను సీఎం పదవికి ఎంపిక చేసింది. ఇవాళ సర్దార్ షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఊరు ఖట్కర్ కలాన్ లో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi Mann )ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు కలిసి మాట్లాడుకున్నారు లోక్ సభలో.
రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు భగవంత్ మాన్. ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజల గొంతుకను వినిపించారు. రైతుల పక్షాన నిలబడ్డారు.
వారి కోసం తన గొంతు విప్పారు. ఒకానొక సమయంలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ పేరు తెచ్చుకున్నాడు భగవంత్ మాన్. ఇక కొత్తగా సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.
ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మన ఇద్దరం కష్టపడి పైకి వచ్చాం. నీకు ప్రత్యేక అభినందనలు మాన్. మన లక్ష్యం ఒక్కటే అదే ప్రజా సంక్షేమం.
పంజాబ్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. కలిసి నడుద్దామంటూ ఆఫర్ ఇచ్చారు ప్రధాని మోదీ.
Also Read : చైనా విదేశాంగ శాఖ మంత్రి రాక