Imran khan : భార‌త్ పై ప్ర‌శంస పాక్ ఆర్మీపై ఫైర్

పీఎం ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్

Imran khan : నిన్న‌టి దాకా ఇండియాపై కారాలు మిరియాలు నూరిన పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్ట‌న్ , ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran khan) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏకంగా ఇండియాను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

ప‌నిలో ప‌నిగా ఆ దేశ ఆర్మీ నిర్వాకంపై ఫైర్ అయ్యారు. వీలైతే రాజీనామా చేస్తాన‌ని కానీ పాకిస్తాన్ ఆర్మీకి త‌లొంచే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. విప‌క్షాలు కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేస్తున్నాయంటూ ఆరోపించారు.

విచిత్రం ఏమిటంటే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. ఇస్లామాబాద్ కోర్టు సైతం ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోవాల‌ని సూచించింది.

ఇదే స‌మ‌యంలో భార‌త్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు. ఆదివారం ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు ఇమ్రాన్ ఖాన్(Imran khan). ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు.

త‌న‌పై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏది చేసినా దేశం కోసం చేశాన‌ని చెప్పాడు. ప‌నిలో ప‌నిగా భార‌త దేశ ఆర్మీ గురించి ప్ర‌స్తావించారు.

ఆర్మీ ఎక్క‌డా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోద‌న్నాడు. ఆ దేశ విదేశాంగ విధానం అద్భుతంగా ప‌ని చేస్తోందంటూ కితాబు ఇచ్చి విస్తు పోయేలా చేశాడు ఇమ్రాన్ ఖాన్.

ఆ దేశం పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుంద‌న్నాడు. ఏ దేశానికి త‌ల వంచ‌ద‌న్నాడు. ఆ దేశం అమ‌లు చేస్తున్న విధానాలు బాగున్నాయంటూ పేర్కొన్నాడు .

విచిత్రం ఏమిటంటే ఆర్మీకి డ‌బ్బులు ఇచ్చి ప‌ద‌వి కాపాడు కోవాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు.

Also Read : ఇమ్రాన్ ఖాన్ పై కోర్టు క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!