Shabaash Mithu Teaser : సూప‌ర్ ‘శ‌భాష్‌ మిథు’ టీజ‌ర్

క్రికెట‌ర్ మిథాలీరాజ్ బ‌యోపిక్

Shabaash Mithu Teaser : దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న శ‌భాష్ మిథు మూవీ (Shabaash Mithu Teaser)టీజ‌ర్ విడుద‌లైంది.

ప్ర‌పంచ మ‌హిళా క్రికెట్ లో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న అరుదైన మహిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్.

త‌న సుదీర్ఘ కెరీర్ లో 23 ఏళ్లుగా ఆట ఆడుతూ వ‌స్తోంది.

పురుష ప్ర‌పంచం డామినేట్ చేస్తున్న క్రికెట్ వ‌ర‌ల్డ్ లోకి అనూహ్యంగా తెర పైకి వ‌చ్చింది మిథాలీరాజ్.

ప‌క్కా హైద‌రాబాదీ అయిన ఈ స్టార్ క్రికెట‌ర్ ను అజ్జూ భాయ్ తో , స‌చిన్ టెండూల్క‌ర్ తో పోలుస్తారు.

ఎన‌లేని రికార్డులు న‌మోదు చేసింది. వ‌రుస‌గా ఆరు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో ఆడిన ఏకైక మ‌హిళా క్రికెట‌ర్ గా రికార్డు న‌మోదు చేసింది.

ప్ర‌స్తుతం కీవీస్ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క్రికెప్ లో పాల్గొంటోంది.

ఇదే త‌న ఆఖ‌రి టోర్నీ అని స్ప‌ష్టం చేసింది. ఇక ఆట నుంచి నిష్క్ర‌మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ త‌రుణంలో ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని శ‌భాష్ మిథు (Shabaash Mithu Teaser)అనే పేరుతో మూవీ తీస్తున్నారు.

ఈ చిత్రంలో తాప్సీ ప‌న్ను న‌టిస్తోంది మిథాలీరాజ్ పాత్ర‌లో.

ఈ చిత్రం తెర‌పై భార‌తీయ క్రికెట్ లో అసాధార‌ణ‌మైన విజేత గురించి ప‌రిచ‌యం చేస్తుంది. మిథాలీ రాజ్ క‌థ‌ను హైలెట్ చేస్తుంది.

ఈ టీజ‌ర్ ను తాజాగా త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది తాప్సీ. ఈ జెంటిల్మెన్స్ స్పోర్ట్స్ లో ఆమె చ‌రిత్ర తిర‌గ రాసేందుకు బాధ ప‌డలేదు.

ఆమె త‌న క‌థ‌ను సృష్టించింది అంటూ పేర్కొంది వ‌యాకామ్ 18 స్టూడియోస్.

విడుద‌ల తేదీని కూడా డిక్లేర్ చేసింది. ప్రియా అవేన్ రచించింది. లండ‌న్ లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో సినిమా లోని

కొన్ని భాగాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌ముఖ బెంగాలీ చిత్ర నిర్మాత శ్రీ‌జిత్ ముఖ‌ర్జీ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : గోల్డెన్ టెంపుల్ లో ఆర్ఆర్ఆర్ టీం

Leave A Reply

Your Email Id will not be published!