LPG Gas Cylinder Price : మన్ కీ బాత్ అంటూ నిత్యం ఊదర గొడుతూ కోట్లాది ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న మోదీ ప్రభుత్వం ధరా భారం మోపుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి.
ఇక ధరల మోత ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నెత్తీ నోరు మొత్తుకుంటున్నా విమర్శలు గుప్పించారే తప్పా ఎందుకు ప్రశ్నిస్తున్నాడని ఒక్కడు కూడా ఆలోచించ లేక పోయాడు.
ఇప్పటికే యుద్దం పేరుతో ఆయిల్ ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. అంతా అనుకున్నట్టు కోట్లాది మంది నిత్యం వాడే గ్యాస్ ధరలు(LPG Gas Cylinder Price) పెరిగాయి. వీటిని పెంచుతూ ఆయిల్, గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇవాళ దేశంలో ప్రశ్నించే వాళ్లు లేరు. పొద్దస్తమానం గుళ్లు గోపురాలు, కులాలు, మతాలు, విధ్వంసాల పేరుతో రాజకీయం చేయడం తప్పితే ప్రజా సమస్యలను పట్టించు కునే వారే కరువయ్యారు.
తాజాగా భారీగా వంట గ్యాస్ ధరల్ని పెంచడంతో జనం నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో దేశీయంగా వంట గ్యాస్ ధరలు (LPG Gas Cylinder Price)పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.
ఇవాళే పెంచుతున్నట్లు వెల్లడించాయి. తక్షణమే ధరలు అమలులోకి వస్తాయని తెలిపాయి. సిలిండర్ కు రూ. 50 చొప్పున పెంచాయి.
దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రాజధాని ఢిల్లీలో రూ. 949 .50 గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర ధర రూ. 2003.50 గా ఉంది. ఇక తెలంగాణలో వంట గ్యాస్ బండబడ ధర వేయి దాటింది.
Also Read : పంజాబ్ స్పీకర్ గా కుల్తార్ సింగ్