Jr NTR : ఆర్ఆర్ఆర్ మూవీ సూప‌ర్ హిట్ – తారక్

ఆర్ఆర్ఆర్ చూసిన ఎన్టీఆర్

Jr NTR  : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్ తో తీసిన ఆర్ఆర్ఆర్ – రౌద్రం ర‌ణం రుధిరం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన భారీ జ‌నాద‌ర‌ణ చూర‌గొంటోంది.

ప్రీ రిలీజ్ కు ముందే చిత్రానికి సంబంధించి పెట్టిన బ‌డ్జెట్ పూర్తిగా వ‌చ్చింద‌ని టాక్. దాదాపు మూడు సంవ‌త్స‌రాల అనంత‌రం జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR )తో పాటు రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు ఆర్ఆర్ఆర్ లో .

హాలీవుడ్ స్థాయికి తీసిపోని విధంగా ఈ సినిమా తెర‌కెక్కించారు ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న‌. వెండి తెర‌పై త‌మ అభిమాన న‌టులు క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ కు పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా క‌నిపిస్తోంది. మ‌రో వైపు సినిమా విడుద‌ల సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్(Jr NTR ), రామ్ చ‌ర‌ణ్ థియేట‌ర్ కు వెళ్లి ర‌చ్చ చేశారు. హైద‌రాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఎన్టీఆర్ త‌న కుటుంబంతో క‌లిసి చిత్రాన్ని చూశారు.

ఇక భ్ర‌మ‌రాంబ టాకీస్ లో రామ్ చ‌ర‌ణ్‌, రాజ మౌళి ఫ్యాన్స్ తో క‌లిసి సినిమా చూశారు. ఆర్ఆర్ఆర్ చూసిన అనంత‌రం ఎన్టీఆర్ బ‌య‌ట‌కు వ‌స్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ చెప్పాడు.

మాట‌లు లేవు. సూప‌ర్ హిట్ అంటూ సంకేతాలు ఇచ్చాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేశాక తార‌క్ చేసిన కామెంట్స్ తో కూడిన వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

400 కోట్ల‌కు పైగా ఆర్ఆర్ఆర్ మూవీకి ఖ‌ర్చు చేసిన‌ట్లు సినీవాలిలో టాక్.

Also Read : “రామారావు ఆన్ డ్యూటీ” జూన్ 17న

Leave A Reply

Your Email Id will not be published!