PV Sindhu : పీవీ సింధుకు ఏపీ సీఎం కంగ్రాట్స్

మ‌రిన్ని టైటిళ్లు గెల‌వాల‌ని ఆకాంక్ష

PV Sindhu : భార‌త స్టార్ షెట్ల‌ర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 (Swiss Open 2022) ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Sandinti Jagan Mohan Reddy) పీవీ సింధు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

స్విస్ ఓపెన్ గెలిచి ఏపీ రాష్ట్రానికే కాదు దేశానికే గ‌ర్వ కార‌ణంగా నిలిచావంటూ పేర్కొన్నారు. విజేత‌గా నిలిచిన నిన్ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇలాంటి అపురూప‌మైన విజ‌యాలు మ‌రిన్ని అందు కోవాల‌ని కొరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా పీవీ సింధుకు(PV Sindhu) ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు.

భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరారు. ఈ ఏడాదిలో సింధు రెండు ప్ర‌ధాన టైటిళ్ల‌ను గెలుపొంద‌డం విశేషం. కాగా వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ -200 బ్యాడ్మింట‌న్ టోర్నీలో వ‌రుస‌గా ఫైన‌ల్స్ కు చేరడం ఘ‌న విజ‌యం సాధించారు.

ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్ మ్యాచ్ లో థాయ్ లాండ్ స్టార్ ష‌ట్ల‌ర్ బుసాన‌న్ ఒంగ్ బ‌మ్ రుంగ్ ఫ‌న్ పై 21-16 , 21-8 వ‌రుస సెట్ల‌లో మ‌ట్టి క‌రిపించి మ‌రోసారి టైటిల్ ను కైవ‌సం చేసుకుంది పీవీ సింధు(PV Sindhu).

ఈ సీజీన్ లో స‌త్తా చాట‌డం సింధుకు అడ్వాంటేజ్ గా మారింది. ఇప్ప‌టికే ఒలింపిక్స్ లో భాగంగా ఆమె అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చాటింది. ఈ సంద‌ర్బంగా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన పీవీ సింధును అభినందించారు.

ఇదిలా ఉండ‌గా స్విస్ టైటిల్ ను కైవ‌సం చేసుకున్న సింధును కేంద్ర క్రీడా శాఖ మంత్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు..

Also Read : ఉగాదిన కొత్త జిల్లాల‌కు ముహూర్తం

Leave A Reply

Your Email Id will not be published!