Spice Jet Flight Hits Pole : పోల్ ను ఢీకొట్టిన స్సైస్ జెట్ విమానం

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న

Spice Jet Flight Hits Pole : ఢిల్లీ విమానాశ్ర‌యంలో టేకాఫ్ కు ముందు స్సైస్ జెట్ విమానం పోల్ ను(Spice Jet Flight Hits Pole) ఢీకొట్టింది. ఈ విమానం జ‌మ్మూకు వెళ్లేందుకు రెడీ కాగా ఫ్లైట్ కుడి రెక్క స్తంభాన్ని ఢీకొట్టింది. రెక్క దెబ్బ‌తింది.

సోమ‌వ‌వారం ఉద‌యం స్సైస్ జెట్ కు చెందిన 737-800 గ‌ల విమానం ప్యాసింజ‌ర్ టెర్మిన‌ల్ నుంచి ర‌న్ వేకి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని స‌మాచారం.

దీంతో విమానంతో పాటు, స్తంభం రెండూ దెబ్బ తిన్నాయి. విమానాన్ని న‌డిపించ‌డంలో స‌హాయ‌ప‌డే రెక్క వెనుక భాగంలో ఉన్న కీల‌క‌మైన భాగం ఇది.

దీంతో ప‌రిస్థితిని గ‌మ‌నించిన విమాన సిబ్బంది తిరిగి విమానం వెళ్లాల్సి వచ్చింది. ప్ర‌యాణీకుల‌ను మ‌రో విమానంలో ఎక్కించారు. ప్ర‌స్తుతానికి భారీ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమానం రెక్క తాక‌డంతో పోల్ వంగి పోయింది. విమానం రెక్క కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

పైల‌ట్ అప్ర‌మ‌త్తం కావ‌డంతో పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు. ఎందుకు అలా జ‌రిగింద‌నే దానిపై. మొత్తంగా పైల‌ట్ చాక‌చ‌క్యం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

స్పైస్ జెట్ లో ఎంత‌మంది ప్ర‌యాణం చేస్తున్నార‌నే దానిపై ఇంకా స‌మాచారం రాలేదు. ఇదిలా ఉండ‌గా ఫ్లైట్ రెక్క ఢీకొన‌డంతో ఒక్క‌సారిగా కుదుపున‌కు లోనైన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే – బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!