Amit Shah : బండి యాత్ర‌కు ట్ర‌బుల్ షూట‌ర్

ఎన్నారైలు మ‌ద్ద‌తు ఇవ్వండి

Amit Shah  : తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు రాష్ట్రంపై క‌న్నేశాయి. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ఉండేది. కానీ తాజాగా ఆప్ కూడా ఇందులో చేరింది.

పంజాబ్ లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం, అక్క‌డ భారీ మ‌ద్ద‌తు రావ‌డంతో దేశ మంత‌టా విస్త‌రించాల‌ని ప్లాన్ చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ అవినీతి పాల‌న‌పైనే ప్ర‌ధానంగా అన్ని పార్టీలు ఫోక‌స్ పెడుతున్నాయి.

ఇక బీజేపీ ప్ర‌త్య‌క్ష పోరుకు స‌న్న‌ద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ చీఫ్ బండి సంజ‌య్(Amit Shah )అమెరికా లోని తెలంగాణ ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు.

తెలంగాణ దొర‌ల చేతిలో బందీ అయి పోయింద‌ని , కేసీఆర్ చెర‌సాల‌లో ఊపిరి ఆడ‌క కొట్టుకు పోతున్న తెలంగాణ త‌ల్లిని విముక్తం చేసేందుకు న‌డుం బిగించే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

మీ పుట్టిన గ‌డ్డ‌కు రుణం తీర్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఏక్ ద‌క్కా తెలంగాణ ప‌క్కా పేరుతో మీటింగ్ చేప‌ట్టారు. ఇక వ‌చ్చే ఏప్రిల్ 14 నుంచి చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌కు ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah )రానున్నారు.

ఆయ‌న గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ అమ్మ వారి ఆశీస్సులు తీసుకుని పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ పాద‌యాత్ర 25 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. రోజుకు 12 కిలోమీట‌ర్లు న‌డుస్తారు.

మొత్తం 300 కిలోమీట‌ర్ల మేర ఈ యాత్ర ప్లాన్ చేశారు. ఒకే వేళ ఆయ‌న రాలేని ప‌క్షంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నాగ‌ర్ క‌ర్నూల్ లేదా మ‌హేశ్వరంలలో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read : కాంగ్రెస్‌కి పీకే జంప్.. తెరాస‌లో హ్యాపీ

Leave A Reply

Your Email Id will not be published!