Radisson Pub : కోరి తెచ్చుకున్న తెలంగాణలో పబ్ , డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన కేసు నడుస్తోంది. మరో వైపు ఇటీవల డ్రగ్స్ కు బానిసై ఓ యువకుడు మృతి చెందాడు.
కానీ పబ్ కల్చర్ మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ లో పేరొందిన ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింక్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరిగింది. ఈ పబ్ కు కేవలం అర్ధరాత్రి 1 గంట వరకే పర్మిషన్ ఉంది.
కానీ అర్ధరాత్రి దాటాక 3.30 తర్వాత కొనసాగుతుండడంతో సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ పబ్ ను మాజీ ఎంపీ కుమార్తె నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ లేట్ నైట్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
వారిలో ప్రముఖ నటుడి కూతురుతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండడం విశేషం. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఉక్కు పాదం మోపుతున్నట్లు ప్రకటించినా ఆచరణలో కనిపించడం లేదు.
పట్టుబడిన వారిలో పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, బిగ్ షాట్స్ , ప్రముఖ నటుల పిల్లలు కూడా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ దొరకడం కలకలం రేపిగింది.
ఫుడింగ్ అండ్ మింక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో యువతీ, యువకులు ఉన్నారు. కొకైన్ కిటికీల బయట , బాత్రూంలలో దొరకడం ఆసక్తికరంగా మారింది.
ఐదుగురిని అదుపులో ఉంచారు. వీరిలో ప్రముఖ నటుడి కూతురు ఉన్నట్లు టాక్. ప్రముఖ హీరో మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలిసింది.
Also Read : ఉపాసన కు ప్రతిభా పురస్కారం