MK Stalin : తమిళనాడుకు చెందిన వర్దమాన టెన్నిస్ ఆటగాడు విశ్వ దీనదయాళన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఒక ఆశా కిరణాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింతగా రాణించి ఉండేవాడని కానీ అంతలోనే విధి అతడిని మనకు దూరం చేసిందని పేర్కొన్నారు.
ఆశా నక్షత్రం, యువ ఆటగాడి అకాల మరణం దిగ్భ్రాంతికరమని ఆవేదన చెందారు స్టాలిన్(MK Stalin). విశ్వ దీనదయాళన్ మృతికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు.
మన రాష్ట్రంలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని వాపోయారు. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌదరి కూడా విశ్వ మృతికి సంతాపం తెలిపారు.
ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. విశ్వ దీనదయాళన్ కు 18 ఏళ్లు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఆడాడు. సత్తా చాటాడు.
అస్సాం లోని గౌహతి నుంచి షిల్లాంగ్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Also Read : ముంబైలో సీఎంల కీలక సమావేశం