Ayush Minister : యోగా జీవితంలో ఓ భాగం కావాలి – సోనోవాల్
ప్రతి చోటా ఘనంగా జరగాలని మంత్రి పిలుపు
Ayush Minister : యోగా అన్నది ప్రతి ఒకకరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్(Ayush Minister). ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
భారత దేశంలో యోగాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొలువు తీరాక యోగాకు మరింత ప్రాచుర్యాన్ని తీసుకు వచ్చారు. జనంలో చైతన్యం పెంపొందించేందుకు కృషి చేశారు.
యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. యోగా అన్నది సాంస్కృతిక కార్యక్రమాల క్యాలెండర్ లో ఒక రోజుగా పరిగణించేలా ఉండ కూడదన్నారు. అది నిరంతరం ఒక భాగం అయ్యేలా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని సూచించారు సోనోవాల్(Ayush Minister).
యోగా వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. యోగా విప్లవానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి.
సాంప్రదాయ అభ్యాసాన్ని వేగవంతం చేయడం, మనస్సు, శరీరం, ఆత్మ కోసం దాని ప్రయోజనాలను ప్రపంచానికి గుర్తు చేసే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని థీమ్ – యోగా ఫర్ హ్యూమానిటీ అనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు సోనావాల్. ప్రచురణ, ప్రసార, సామాజిక మాధ్యమాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు.
100 నగరాలు 100 సంస్థలు ఇందులో భాగం పంచుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
Also Read : కీళ్ల నొప్పులు తగ్గాలంటే రేగుపండ్లు తినాల్సిందే..