న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై సీరియస్ కామెంట్స్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. జంతర్ మంతర్ వద్ద పోలీసుల దుష్ప్రవర్తనపై సమాధానం చెప్పాలని అన్నారు. నిరసన సందర్భంగా మహిళా నిరసనకారులు, జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. మహిళా నిరసనకారులు, జర్నలిస్టులతో ఢిల్లీ పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని రాహుల్ గాంధీ ఆరోపించారు . దీనిపై బేషరతుగా వివరణ ఇవ్వాలన్నారు హోం మంత్రిని ఉద్దేశించి. ఢిల్లీ పోలీసులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు కాబట్టి అమిత్ షా తప్పక సమాధానం చెప్పాలని అన్నారు. జంతర్ మంతర్ వద్ద ఒక పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారని ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. గంటల తరబడ వందలాది మంది జర్నలిస్టులు ఒకే ఒక్క డిమాండ్‌తో అక్కడ కూర్చున్నారని తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసుల ప్రాథమిక విధి కాదా? అని ప్రశ్నించారు. ఒక్కరోజే జంతర్ మంతర్ వద్ద వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. కెమెరాలను లాక్కున్నారు, జర్నలిస్టులను ఈడ్చుకెళ్లారు. ఇది మొదటిసారి కాదు గతంలో కూడా పోలీసు అధికారులు మహిళలతో హేయమైన దురుసుగా ప్రవర్తించిన వీడియో ఆధారాలను మనం చూశాం అని అన్నారు. తమ భద్రతపై భయంతో ఉన్న ఢిల్లీ వ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు సత్యాగ్రహం చేస్తున్నారని, కానీ వారిని రక్షించాల్సిన పోలీసులు మాత్రం వారిపైనే చేయి చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క మహిళ ఫిర్యాదును కూడా నమోదు చేయడానికి భయపడే ప్రభుత్వం అసలు దేనిని రక్షిస్తోంది? అని నిలదీశారు.
