Araku Cafe : ముంబై – ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త మహీంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆయన దేశంలోని వ్యాపారవేత్తల కంటే భిన్నంగా ఉంటారు. తనను తాను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ , పరిశీలించుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటూ తనకు ఇష్టమైన అంశాలను ప్రస్తావిస్తారు. వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తారు. ఇది ఆయన ప్రత్యేకత.
Araku Cafe Viral in Mumbai
ఆనంద్ మహీంద్రా వెరీ స్పెషల్ ఎందుకంటే ఆయనకు కష్టపడి పైకి వచ్చిన వాళ్లు, దేశం ఔన్నత్యం కోసం పాటు పడే వాళ్లు, జాతీయ పతాకాన్ని గౌరవించేలా కృషి చేసే వాళ్లను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వస్తుంటారు. అంతే కాదు తమ కంపెనీ తయారు చేసిన వాహనాలను బహుమతిగా ఇస్తుంటారు.
ఆ మధ్యన తక్కువ ధరకే దోసెలు వేస్తూ వచ్చిన తమిళనాడుకు చెందిన వృద్దురాలి శ్రమను గుర్తించారు. అంతే కాదు తన సిబ్బందిని అక్కడికి పంపించి ఆమెకు ఇల్లు కట్టించారు తన స్వంత డబ్బులతో. తాజాగా ఆనంద్ మహీంద్రా సంచలన విషయాన్ని పంచుకున్నారు. అదేమిటంటే తాను ప్రారంభించిన అరకు(Araku) కేఫ్ ఇప్పుడు ముంబైలో హల్ చల్ చేస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేఫ్ కు జనం పోటెత్తారు. ఇదిలా ఉండగా 2017లో తొలిసారిగా అరకు కేఫ్ ను ప్యారిస్ లో ప్రారంభించామని తెలిపారు. ఈ కేఫ్ కు ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ రైతుల గురించి ప్రస్తావించారు మహీంద్రా చైర్మన్.
Also Read : Chandra Babu Offer : జేడీకి బాబు బంపర్ ఆఫర్