Anushka Sharma Dhoni : ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ
Anushka Sharma Dhoni : ఎవరీ అనుష్క శర్మ అనుకుంటున్నారా. ఆమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ క్రికెటర్ రన్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ భార్య. కోహ్లీ ఎక్కడ ఆడినా అక్కడికి తన కూతురుతో కలిసి వెళుతుంది. ఆటను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో 25వ కీలక మ్యాచ్ ఝార్ఖండ్ డైనమెంట్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ , ఫాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ పోటీ పడ్డాయి.
ఈ సందర్బంగా ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 226 రన్స్ చేసింది 6 వికెట్లు కోల్పోయి. ఆఖరు ఓవర్ లో ఇంకా రెండు బంతులు ఉండగా మైదానంలోకి వచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో 40 వేలకు పైగా ఉన్న చిన్న స్వామి స్టేడియం పూర్తిగా ధోనీ ధోనీ నినాదాలతో దద్దరిల్లి పోయింది. ఒక్క జియో సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ధోనీ ఆట చూసేందుకు రెండున్నర కోట్ల మంది వీక్షించినట్లు జియో సంస్థ వెల్లడించింది. ఇది వ్యూయర్స్ షిప్ లో ఓ రికార్డు గా చెప్పుకోవచ్చు.
ధోనీకి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రధానంగా యువ ఆటగాళ్లకు అతడో మెంటర్. ఈ సందర్భంగా మ్యాచ్ చూస్తున్న కోహ్లీ భార్య అనుష్క శర్మ(Anushka Sharma Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేనే కాదు మా ఆయనతో పాటు కోట్లాది మంది ధోనీని అభిమానిస్తారంటూ పేర్కొంది. ప్రస్తుతం అనుష్క శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : గంగూలీని అన్ ఫాలో చేసిన కోహ్లీ