Inter Results: రేపే ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు !

రేపే ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు !

Inter Results: ఆంధ్రప్రదేశ్(AP) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ముందుగా ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం రాగా… తాజాగా 12న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. మూల్యాంకనాన్ని మరోసారి పరిశీలించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలకు ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do ద్వారా తెలుసుకోవచ్చు.

Inter Results Tomorrow

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి ఫస్టియర్‌ కు 5,17,617, సెకండ్ ఇయర్‌ కు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అయితే ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఫలితాలు వెల్లడించేందుకు ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితాల విడుదలతో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌ 26న విడుదల చేశారు. కాగా ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయడం విశేషం.

Also Read : Nara Lokesh : సడన్ గా కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!