Bhagavanth Kesari Teaser : బాల‌య్య బ‌ర్త్ డే గిఫ్ట్

10న టీజ‌ర్ విడుద‌ల

Bhagavanth Kesari Teaser : తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉన్నారు నందమూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న అటు వెండి తెర‌పై ఇటు బుల్లి తెర‌పై ఏలుతున్నారు. బాల‌య్య బాబు పుట్టిన రోజు వేడుక‌గా భ‌గ‌వంత్ క‌స్తూరి(Bhagavanth Kesari) చిత్రంపై టీజ‌ర్ విడుద‌ల కానుంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థ‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు అభిమానులకు పండ‌గ కాబోతోంద‌ని పేర్కొన్నారు.

స‌ర్ ప్రైజ్ చేసేందుకు ఆగాల‌ని ఇది బాల‌య్య చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌న్నారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇప్ప‌టికే నంద‌మూరి కి చెందిన సినిమా ఇది 108వ‌ది కావ‌డం విశేషం. భ‌గ‌వంత్ అంటే విష్ణువు అని కేస‌రి అంటే హిందీలో సింహం అనే అర్థం వ‌చ్చేలా సినిమాకు భ‌గ‌వంత్ కేస‌రి పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ పోస్ట‌ర్ తో పాటు మూవీ పేరును ప్ర‌క‌టించారు. జూన్ 10 శ‌నివారం నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. శుక్ర‌వారం ఇందుకు సంబంధించిన ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు. ఫోటోలు ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జ‌న్మ దినోత్స‌వం సంద‌ర్భంగా భ‌గ‌వంత్ క‌స్తూరి సినిమాకు సంబంధించి టీజ‌ర్ ను 108 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా ముద్దు గుమ్మ శ్రీ‌లీల కూడా న‌టించ‌నుంది. ద‌స‌రా కానుకగా సినిమాను తీసుకు రానున్న‌ట్లు స‌మాచారం.

Also Read : AP Employees Jagan : జ‌గ‌న్ కు ఉద్యోగ సంఘాల స‌న్మానం

 

Leave A Reply

Your Email Id will not be published!