AP Employees Jagan : జ‌గ‌న్ కు ఉద్యోగ సంఘాల స‌న్మానం

కాత్త‌గా జీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ

AP Employees Jagan : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. తాను ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌లో 99 శాతం పూర్తి చేశాన‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు తాను మాట‌లు చెప్ప‌న‌ని చేసి చూపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం ఏపీకి చెందిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈమేర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని(CM Jagan Reddy) అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. వారు గ‌త కొంత కాలం నుంచీ త‌మ న్యాయ ప‌ర‌మైన డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ వ‌చ్చారు. చివ‌ర‌కు ఆందోళ‌న చేయాల్సి వ‌స్తుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈ మేర‌కు సీఎంతో చ‌ర్చ‌లు జ‌రిపారు.

దేశంలోని ఏ రాష్ట్ర‌మైనా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాలంటే ఉద్యోగుల స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి. దీంతో వారు లేకుండా ప‌ని చేయ‌డం కుద‌ర‌ని సూచించారు. మాన‌వ‌తా దృక్ఫ‌థంతో సీఎం జ‌గ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ ఉద్యోగుల‌కు జీపీఎస్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అంతే కాకుండా కొన్నేళ్లుగా కాంట్రాక్టు ప‌ద్ద‌తిన వెట్టి చాకిరీ చేస్తున్న వారంద‌రికీ శుభ‌వార్త చెప్పారు. వారిని కూడా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. దీంతో జీపీఎఎస్ తో పాటు కాంట్రాక్టు కార్మికులను ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెప్పిన సీఎంను ఇవాళ తాడేప‌ల్లి గూడెం ఆఫీసులో ఘ‌నంగా స‌న్మానించారు ఎపీ ఎంప్లాయిస్ సంఘాలు.

Also Read : Sushil Kumar Shinde : సీఎం సిద్ద‌రామ‌య్య‌తో షిండే భేటీ

 

Leave A Reply

Your Email Id will not be published!