BRS Chief KCR: బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే కేజ్రీవాల్ అరెస్టు – కేసీఆర్
బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే కేజ్రీవాల్ అరెస్టు - కేసీఆర్
BRS Chief KCR: మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయడం రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు… భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. హేమంత్ సోరెన్, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని కేసీఆర్(KCR) ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
BRS Chief KCR Comment
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టును ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ అరెస్ట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇదే కేసులో… గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైల్లో ఉన్నారు.
Also Read : CSK vs RCB : టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్…అందులో బ్యాటింగ్….