BRS : భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారే రాజులు. అంతిమంగా వారు కోరుకున్న వారినే ఎన్నుకునే సౌలభ్యం ఉంది . కానీ రాను రాను నేతలు ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫిరాయింపుల పర్వం, కాసుల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు కూలి పోయిన , కూల్చిన సంఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొమ్మిదిన్నర ఏళ్లుగా నిరాటంకంగా , రాచరిక పాలన సాగిస్తూ వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. తనకు ఎదురే లేదని అనుకున్న ఆయనకు ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ గాయబ్ కాగా కొత్తగా సర్కార్ ను ఏర్పాటు చేసింది ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు బాగా వర్కవుట్ అయ్యాయి.
BRS Comment Viral
ఇదంతా పక్కన పెడితే అవినీతి , అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలు, ల్యాండ్, మైనింగ్, శాండ్ కు , దౌర్జన్యాలకు తెర తీసింది బీఆర్ఎస్ . దీంతో జనం తీవ్ర ఆగ్రహాన్ని తమ ఓట్ల రూపంలో తెలియ పరిచారు. హస్తానికి 64 సీట్లు కట్టబెట్టారు. అయితే ఏ సెటిలర్స్ ను పదే పదే విమర్శిస్తూ వచ్చారో వారే నగరంలో భారీ సీట్లను కట్టబెట్టారు బీఆర్ఎస్(BRS) కు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మరో వైపు ఇతర పార్టీలను దెబ్బ కొట్టాలని అనుకున్న ఎంఐఎంకు ఈసారి ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. ఏడు సీట్లు గెలుచుకున్నా ఆశించిన మేర మెజారిటీ దక్కించు కోలేక పోయింది. ఆపార్టీ బీఆర్ఎస్ కు వంత పాడటమే. ఇదిలా ఉండగా ఏ పార్టీకి అయినా అధికారం అన్నది శాశ్వతం కాదు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ సారథ్యంలోని నేతలు గతి తప్పారు. మతి తప్పి మాట్లాడుతున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దిగజారి కామెంట్స్ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుందని తిరిగి తాము అధికారంలోకి వస్తామని, మరోసారి సీఎం కేసీఆర్ అవుతాడంటూ విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి అన్నారు. మరో ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం ఈ సర్కార్ పడి పోతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో బీజేపీ(BJP) చీఫ్ , కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి సైతం నోరు జారారు. త్వరలోనే ఈ ప్రభుత్వం ఉండబోదన్నారు. నేతల మాటల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు ఇకనైనా తెలుసు కోవాలి. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఇలాంటి చవకబారు నేతల గురించి ఓటు వేయలేదని తెలుసు కోవాలి. ఎవరైనా పక్క చూపులు చూసినా, సర్కార్ ను పడగొట్టే ప్లాన్ వేసినా లేదా జంప్ అయినా జనం రాళ్లు తీసుకుని తన్ని తరిమే రోజు దగ్గరలో ఉందని గుర్తిస్తే మంచింది.
Also Read : Smita Sabharwal Comment : ‘స్మితం’ సంచలనం