బీఎస్పీ చీఫ్ మాయావ‌తి యూ ట‌ర్న్

మ‌రోసారి మేన‌ల్లుడు ఆకాష్ కే బాధ్య‌త‌లు

ల‌క్నో : ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు బీఎస్పీ చీఫ్‌, మాజీ సీఎం కుమారి మాయావ‌తి. ఆమె యూట‌ర్న్ తీసుకున్నారు. బీఎస్పీ జాతీయ కన్వీనర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు మేనల్లుడు ఆకాష్ ఆనంద్. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి పక్కన పెట్టిన నెల రోజుల లోపే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అతన్ని తిరిగి పార్టీ జాతీయ కన్వీనర్‌గా నియమించారు. సెప్టెంబర్ 10న, ఆకాష్ తన బాధ్యతలను నిర్వహించడంలో విఫలమయ్యాడని , బీఎస్పీ కంటే కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని పేర్కొంటూ మాయావతి అతన్ని సంస్థాగత బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆకాష్ బాధ్యతా రాహిత్య ప్రవర్తనకు అతని మామ అశోక్ సిద్ధార్థ్ కారణమని కూడా ఆమె అప్పట్లో ఆరోపించారు.

అయితే, తెరవెనుక జరిగిన అనేక చర్చల అనంతరం, అక్టోబర్ 2న ఆకాష్ మాయావతికి క్షమాపణలు చెప్పారని, ఆమెను “బువా మా” (అత్తమ్మ) అని సంబోధిస్తూ బీఎస్పీకి సేవ చేసేందుకు మరో అవకాశం కోరారని సమాచారం. మాయావతి తన రాజకీయ గురువు అని ఆయన పేర్కొన్నారు. దీనిని అనుసరించి, పార్టీ ,ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా ఆకాష్‌ను తిరిగి పార్టీ జాతీయ కన్వీనర్‌గా నియమించాలని “బువా మా” నిర్ణయించుకున్నారు. దీర్ఘంగా ఆలోచించిన తర్వాత, పార్టీ, ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, ఆకాష్ ఆనంద్‌ను మరోసారి బీఎస్పీ జాతీయ కన్వీనర్‌గా నియమించాలని, పార్టీలో పనిచేసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించామని ప్ర‌క‌టించారు మాయావ‌తి.

Leave A Reply

Your Email Id will not be published!