Revanth Reddy Review : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన షురూ
ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి శ్రీకారం
Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పనితీరుపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Reviews on TSPSC
దేశ వ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ఎస్సీ) తీరు తెన్నులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ బృందం ఢిల్లీకి వెళ్లి పరిశీలించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్స్ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకతతో నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం.
సుప్రీంకోర్టు నియమ, నిబంధనలకు అనుగుణంగా చైర్మన్, సభ్యుల నియామకాలు ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ , ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి పాల్గొన్నారు.
Also Read : Kerala Governor : నన్ను చంపేందుకు సీఎం కుట్ర