అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సర్వ నాశనం చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నామన్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల, బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తో కలిసి పాల్గొన్నారు . ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు. వైసీపీ ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఏపీ కూటమి సర్కార్ కేవలం ఈ రెండేళ్లలోనే భారీగా బిటుమినస్ (BT) రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. పల్లె పండుగ 1.0, 2.0′ ద్వారా ₹9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 100 రెట్లు అధికంగా ‘మినీ గోకులం’ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని స్థితి నుండి పంచాయతీలు తమ సొంత అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకునే స్థాయికి వాటిని తీసుకు వచ్చామని తెలిపారు సీఎం.
SC, ST కాలనీలలో 6,500 కి.మీ మేర CC రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు. అటవీ, కొండ ప్రాంతాలలో 1,500 కి.మీకు పైగా రోడ్ల నిర్మాణం ప్రారంభించామన్నారు. సమగ్ర గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ‘పల్లె పండుగ 3.0 చేపట్టామన్నారు. ‘పల్లె పండుగ 3.0’లో: 6,000 కి.మీ CC రోడ్లు, 9,500 కి.మీ BT రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం. 22,500 మినీ గోకులం యూనిట్లు.. 50,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపడతామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధికి భారీ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శకమైన గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం అన్నారు. ₹11,085 కోట్ల విలువైన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమ ప్రారంభానికి వేదికగా ఉదయగిరి ఉండడం ఆనందంగా ఉందన్నారు సీఎం.
