మాజీ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ ఇళ్ల‌లో ఈడీ దాడులు

నిర్మ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపిన సోదాలు

నిర్మ‌ల్ జిల్లా : నిర్మ‌ల్ జిల్లా లోని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ దాడులు చేప‌ట్టింది. మొత్తం రెండు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈడీ సోదాలు చేప‌ట్టింది. సత్తెనపల్లిలోని రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గతంలోనే తేల్చింది పౌరసరఫరాల శాఖ. ఈ సంద‌ర్బంగా రేఖా నాయక్‌పై BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ధాన్యం గోల్‌మాల్‌లో మనీలాండరింగ్ కోణంపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.

ఇదిలా ఉండ‌గా రేఖా నాయ‌క్ కు సంబంధించి చూస్తే త‌ను రాజ‌కీయ నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు.
త‌ను 2023 సంవ‌త్స‌రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 -2023 వ‌ర‌కు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌ను 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. 2014లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో రెండోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉండ‌గా 2023లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్ఠానం రేఖా నాయక్‌కు బదులుగా భూక్య జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది.

Leave A Reply

Your Email Id will not be published!