Election Commission : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చందక్ తెలిపారు...

Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(EC) షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అనుజ్ చందక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చులను అంచనా వేయడానికి పోస్టర్లపై ప్రచురణకర్త పేరును తప్పనిసరిగా ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, బోర్డులపై పబ్లిషర్ పేరు లేకుండా కొన్నిసార్లు పెడుతున్నారు. దీంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్స్, హోర్డింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చందక్ తెలిపారు.

Election Commission Orders

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, జెండాలు, బ్యానర్లు ప్రచురణకర్త పేరు లేకుండా ముద్రించరాదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో రాజకీయ ప్రకటనలు విడుదల చేయరాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ డిక్లరేషన్లను ముందుగా ధ్రువీకరించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

Also Read : Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి..

Leave A Reply

Your Email Id will not be published!