EMRS Recruitment 2023 : ఏక‌ల‌వ్య స్కూళ్ల‌లో 6,329 పోస్టులు

దేశ వ్యాప్తంగా భారీగా ఖాళీలు

EMRS Recruitment 2023 : నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది కేంద్రం. ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో ఖాళీగా ఉన్న 6,329 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. టీజీటీ, హాస్ట‌ల్ వార్డెన్ , నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఈ మేర‌కు నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ సొసైటీ ఫ‌ర్ ట్రైబ‌ల్ స్టూడెంట్స్ నోటిఫికేష‌న్(EMRS Recruitment 2023) జారీ చేసింది.

EMRS Recruitment 2023 Notification

దేశంలోని బెంగాలీ, గుజ‌రాతీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, మ‌ణిపురి, మ‌రాఠీ, ఒడిశా, తెలుగు, ఇంగ్లీష్ , మ్యాథ్స్ , సోష‌ల్ స్టోడీస్ , ఉర్దూ, సైన్స్ , మిజో , సంస్కృతం , త‌దిత‌ర భాష‌ల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఇక టీజీటీ పోస్టుల‌కు సంబంధించి పీజీతో పాటు బీఈడీ , సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పీఈటీ పోస్టుల‌కు డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ లైబ్రేరియ‌న్ పోస్టుకు బీఎల్ఐఎస్సీ, డిగ్రీ పాసై ఉండాలని పేర్కొంది. ఈఎంఆర్ఎస్ సెలెక్ష‌న్ ఎగ్జామ్ , ఉత్తీర్ణ‌త ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామ్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

టీజీటీ పోస్టులు 5,600 ఉండ‌గా హాస్ట‌ల్ వార్డెన్ మేల్ 335 , హాస్ట‌ల్ వార్డెన్ ఫిమేల్ 334 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల‌ను అనుస‌రించి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. టీజీటీ పోస్టుల‌కు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 , ఇత‌ర స‌బ్జెక్టుల‌కు రూ. 35,400 నుంచి రూ. 1,13,400 దాకా వేత‌నం ఉంటుంది. హాస్ట‌ల్ వార్డెన్ కు నెలకు రూ. 29,200 నుంచి 92,300 దాకా ఉంటుంది.

Also Read : Kapil Dev : ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌న‌దే – క‌పిల్

 

Leave A Reply

Your Email Id will not be published!