Kisan Garjana Rally : కిసాన్ గర్జన భగ్గుమన్న రైతన్న
మోదీ సర్కార్ పై ఆగ్రహం
Kisan Garjana Rally : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ పై రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీ లోని రామ్ లీలా మైదనాంలో కిసాన్ గర్జన నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు(Kisan Garjana Rally) పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గర్జన చేపట్టారు. ఓ వైపు తాము ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇంకో వైపు బడా బాబులు, కార్పొరేట్ల ఆస్తులు అంతకంతకతూ పెరుగుతున్నాయని దీనికి ఎవరు కారణమంటూ ప్రశ్నించారు.
సాగు చేయడం భారంగా మారిందని, ఇప్పటి వరకు బతుకు దెరువు లేక ఆత్మహత్యలకు పాల్పడిన వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారం రోజుల పాటు పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులు వాడుతున్న పనిముట్లపై జీఎస్టీ ఎలా విధిస్తుందని నిలదీశారు.
వెంటనే జీఎస్టీని ఎత్తి వేయాలని కోరారు. పెట్టుబడి కింద ఇస్తున్న సాయం రూ. 6 వేలు సరి పోవడం లేదన్నారు. దానిని రూ. 12 వేలకు పెంచాలని స్పష్టం చేశారు. లేక పోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకు రావాలని కోరారు రైతులు. భారీ ఎత్తున రైతులు పాల్గొనడం విస్తు పోయేలా చేసింది.
భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహినీ మోహన్ మిశ్రా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు.
Also Read : ఒప్పుకోనన్న ధన్ ఖర్ తప్పదన్న ఖర్గే
Thanks covering news